సీఎం చంద్రబాబుతో లగడపాటి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లగడపాటి మీడియాతో మాట్లాడుతూ తాను మర్యాద పూర్వకంగానే చంద్రబాబును కలిశానన్నారు. అలాగే తొలిసారి సచివాలయాన్ని సందర్శించానని, హైదరాబాద్ సచివాలయం కన్నా అమరావతి సచివాలయం చాలా బాగుందని అన్నారు. తాత్కాలిక సచివాలయమే ఇంత అందంగా ఉంటే ఇక అసలు సచివాలయం వరల్డ్క్లాస్గా ఉంటుందన్నారు. సచివాలయాన్ని అందంగా తీర్చిదిద్దినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించానన్నారు.






