Minister Nimmala : సూపర్ జీఎస్టీ, సూపర్ సక్సెస్ విజయవంతం చేయాలి : మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ మాఫియాను పెంచి పోషించిందే వైఎస్ జగనే అని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) విమర్శించారు. కర్నూలు (Kurnool) లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మాఫియాను అరికట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కఠిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.