Harish Rao: హైడ్రా పేరుతో పేదల ఇళ్లే : హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. రహమత్‌నగర్‌లో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఏ పని జరగాలన్నా కాంగ్రెస్ (Congress)నేతలు కమీషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయి. మా హయాంలో పేదల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. అక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. ఔషధాలు కూడా ఉండటం లేదు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లే కూలుస్తున్నారు. పెద్దలవి కూల్చడం లేదు అని ఆరోపించారు.






