మండలికి అరుదైన గౌరవం
తెలుగు భాషాభివృద్ధికి చేసిన సేవకుగాను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు కృష్ణా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. కేయా నాలుగో స్నాతకోత్సవం సందర్బంగా ఈ అరుదైన గౌరవాన్ని గవర్నర్ నరసింహన్ ద్వారా ఈనెల 22న బుద్ధప్రసాద్ అందుకోనున్నారు. బుద్ధప్రసాద్ తెలుగు భాష అభివృద్ధి కోసం దశాబ్ధాలుగా కృషి చేస్తున్నారు. దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకట కృష్ణారావు తనయుడిగా బుద్ధప్రసాద్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బాల్యం నుంచి భాషాభిమానం పట్ల మక్కువతో మండలి అనేక సేవా కార్యక్రమాలతో తెలుగు భాషోద్యమ సేనానిగా గుర్తింపు పొందారు. హైదరాబాద్‌లో తెలుగుతల్లి విగ్రహంపై తెలుగులో రాయకపోవడం, ఎక్కడా తెలుగుకు గుర్తింపు లేకపోవడంపై ఈయన గతంలో చేసిన ఆందోళనలు ఫలితాన్నిచ్చాయి.













