Satyavardhan: సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం
దళిత యువకుడు సత్యవర్థన్ (Satyavardhan) కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అజ్ఞాతంలో ఉన్న కీలక నిందితుడు కొమ్మా కొట్లు (Komma Kotlu) విజయవాడ పటమట పీఎస్లో (Vijayawada Patamata PS) లొంగిపోయాడు. ఇదే కేసులో ఇద్దరు నిందితులు తేలప్రోలు రాము, వజ్రకుమార్ ఇటీవల కోర్టులో లొంగిపోయారు. మరోవైపు కీలక నిందితుడు ఎర్రంశెట్టి రామాంజనేయులను పటమట పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా వల్లభనేని వంశీ, ఏ2గా కొమ్మా కొట్లు ఉన్నారు. టీడీపీ కార్యాలయం (TDP office)పై దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తరలించడం అక్కడినుంచి విజయవాడకు తీసుకురావడంలో కొమ్మా కొట్లు కీలకంగా వ్యవహరించినట్లు సమచారం. ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ సత్యవర్థన్పై వంశీ అనుచరులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చి కిడ్నాప్ చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే.
– NS GOUD






