మళ్లీ సీఎం చంద్రబాబునే : జేసీ
ప్రజల ఆశయాలు నెరవేరాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో నీరు-ప్రగతి ఉద్యమం ప్రారంభం సందర్భంగా పామిడిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ నీటి విషయంలో ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పోలవరంపై ప్రజలు కలలు కన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు కష్టపడి పోలవరాన్ని సాధించారన్నారు. వైఎస్ జగన్ ఏమి చేయలేరనే టీడీపీలో చేరానని అన్నారు. మంత్రి పదవి కోసం తాను పార్టీలో చేరలేదన్నారు. హంద్రీ-నీవా కాలువకు స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని ఆ ప్రాంతవాసులను కోరారు.













