Bala Showry: లోక్‌సభలో విశేష రికార్డు సాధించిన జనసేన ఎంపీ బాలశౌరి..

జనసేన పార్టీ (JanaSena Party) తరఫున మచిలీపట్నం (Machilipatnam) నుండి ఎంపీగా గెలిచిన బాలశౌరి (Bala Showry) ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల మధ్య కూడా చర్చకు వస్తున్నారు. సాధారణంగా ప్రజాప్రతినిధుల పనితీరుపై అనేక విమర్శలు వస్తుంటాయి. కొందరు నాయకులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంటే, కొందరు మాత్రం ప్రజల కోసం నిజాయితీగా కృషి చేస్తున్నారు. ఆ రెండవ వర్గంలో నిలుస్తూ ప్రజల పక్షాన నిలిచే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో బాలశౌరి ఒకరు.
తాజాగా విడుదలైన లోక్‌సభ (Lok Sabha) నివేదికలో ఆయన పనితీరు విశేషంగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 543 మంది పార్లమెంటు సభ్యులలో బాలశౌరి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయన 72 ప్రశ్నలు అడగడంతో పాటు 18 అంశాలపై జరిగిన చర్చల్లో కూడా పాల్గొన్నారు.. అన్నిటిలో హైలైట్ హాజరులోనూ ఆయన రికార్డు . దాదాపు 80 శాతం హాజరుతో పార్లమెంటులో తరచుగా కనిపించిన ఎంపీగా గుర్తింపు పొందారు. ఇది ఇతరులతో పోల్చుకుంటే ప్రత్యేకమైన అంశంగా మారింది.
ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎప్పుడూ స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ఈ నివేదికలో కూడా బాలశౌరి అడిగిన ప్రశ్నలు ప్రజల సమస్యలపై ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఎంపీగా ప్రజల తరఫున తన బాధ్యతను నెరవేర్చడమే కాకుండా, కేంద్ర స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి కృషి చేస్తూ వస్తున్నారు.
గతంలో వైసీపీ (YCP) తరఫున ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యంగా పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రీకరించి, రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నాలు చేశారు. మచిలీపట్నం పోర్టు (Machilipatnam Port) సహా పలు జాతీయ ప్రాజెక్టులను తీసుకురావడం కోసం కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా ఆయన ప్రజలకు చేరువైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే రాజకీయ పరిణామాల మధ్య వైసీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన బాలశౌరి ఆ పార్టీని వీడారు. తరువాత జనసేనలో చేరి ఆ పార్టీ తరఫున మళ్లీ మచిలీపట్నం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వరుస విజయాలతో పాటు ఇప్పుడు పార్లమెంటులోనూ మంచి పనితీరుతో రికార్డు నమోదు చేయడం ఆయనకు మరింత గౌరవాన్ని తెచ్చింది.
వివాదాస్పద అంశాలపై దూరంగా ఉంటూ, శాంత స్వభావంతో ప్రజా సమస్యలపై దృష్టి సారించడం ఆయన రాజకీయ బలంగా మారింది. అందుకే ప్రస్తుతం జనసేనలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా బాలశౌరి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కృషి వల్ల మచిలీపట్నం ప్రజలు మాత్రమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు కూడా గర్వపడేలా మారింది.