Jubilee Hills: జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత నాది : మంత్రి పొన్నం
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు, విద్యావంతుడని, అతడిని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ (Jubilee Hills) అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ (Yusufguda) డివిజన్లోని శ్రీకృష్ణ నగర్లో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత తనదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ, నవీన్ యాదవ్ (Naveen Yadav) ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కొకరికి 6కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని గుర్తు చేశారు. వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తూ మహిళలకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు.







