Donald Trump: వచ్చే ఏడాది భారత్‌కు వస్తానన్న ట్రంప్
భారతదేశంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వచ్చే ఏడాది తాను భారత్‌లో పర్యటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. భారత్‌తో ట్రేడ్ టాక్స్ (వాణిజ్య చర్చలు) అద్భుతంగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. “ప్రధానమంత్రి మోడీ (PM Modi) గొప్ప వ్యక్తి, నాకు మంచి మిత్రుడు. ఆయన నన్ను ఆహ్వానించారు. నేను త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాను, ప్రైవేట్ రంగంతో కలిసి వచ్చే ఏడాది భారత్‌కు వెళ్తాను,” అని ట్రంప్ (Donald Trump) చెప్పారు. టారిఫ్‌లను తగ్గించడం, మార్కెట్ యాక్సెస్‌ను పెంచడం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారతదేశం హామీ ఇచ్చిందని కూడా ట్రంప్ (Donald Trump) ఈ సందర్భంగా మరోసారి తెలిపారు.







