Afghan-Pak Tensions: అఫ్గాన్ దాడుల వెనుక భారత్.. పాక్ షాకింగ్ ఆరోపణలు!

Afghan-Pak Tensions: అఫ్గాన్ దాడుల పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు భారతే కారణమని పాక్ ఆరోపించింది. కొన్నిరోజులుగా ఈ రెండు దేశాల సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాలపై జరిగిన దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల గురించి మాట్లాడిన పాక్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారత్ (India) తరఫున అఫ్గాన్ ఇలా పరోక్ష యుద్ధం చేస్తోందని నిందించారు. పాక్- అఫ్గాన్‌ల మధ్య కుదిరిన 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా ఆసిఫ్ (Khawaja Asif) సందేహాలు వ్యక్తం చేశారు. అఫ్గాన్‌కు సంబంధించిన నిర్ణయాలను కాబుల్‌లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు.
‘అఫ్గాన్‌లో (Afghanistan) భారీగా దాడులు జరిగాయి. స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు. కానీ అది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదు’ అని ఆసిఫ్ అన్నారు. అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్‌లో పర్యటించడంపై కూడా ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఈ పర్యటన కేవలం వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించింది కాదని, దీని వెనుక ఇంకేవో ఉద్దేశాలున్నాయన్నారు. అదే సమయంలో ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దంటూ అఫ్గాన్‌కు ఆసిఫ్ (Khawaja Asif) హెచ్చరికలు చేశారు.