ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఎనిమిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానచలనం చెందిన కలెక్టర్ల వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కలెక్టర్టగా విజయ్ చంద్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీకాంత్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ధనుంజయ్ రెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా శశిధర్, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా వీర పాండ్యన్, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా వి.ఎస్.ప్రద్యుమ్నలు నియమితులయ్యారు.






