T20 World Cup: ఇండియా సెమీస్ చేరాలంటే..?
టి 20 వరల్డ్ కప్ లో చిన్న జట్లపై గెలిచి బలంగా కనపడిన భారత జట్టు(Team India), సఫారీలతో జరిగిన సూపర్ 8 స్టేజ్ తొలి పోరులో బోల్తా పడింది. అంచనాలకు మించి రాణిస్తారు అనుకున్న ఆటగాళ్ళు కనీసం క్రీజ్ లో నిలబడటానికి కూడా ఇబ్బంది పడ్డారు. బౌలింగ్ లో సఫారీలను కట్టడి చేసిన భారత్.. బ్యాటింగ్ లో మాత్రం సఫారీ బౌలర్ల ధాటికి తేలిపోయింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం, పరుగులు చేయలేకపోవడంతో భారత్ భారీ తేడాతో ఓటమి పాలైంది అనే చెప్పాలి. మరి ఇక్కడి నుంచి సెమీస్ కు చేరడం ఎలా..?
ఇదే క్రికెట్ ఫ్యాన్స్ ను కంగారు పెట్టే విషయం. సూపర్ 8 దశ భారత్ దాటాలి అంటే.. భారీ విజయాలు అవసరమైన పరిస్థితి ఏర్పడింది. చిన్న జట్లు అయిన జింబాబ్వే, వెస్టిండీస్ మీద భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. తదుపరి రెండు మ్యాచ్ లలో భారత్ గెలవడమే కాకుండా.. నెట్ రన్ రేట్(Net Run Rate) పై దృష్టి పెట్టాల్సి ఉంది. ఒకవేళ భారత్ ఒక మ్యాచ్ గెలిస్తే, దక్షిణాఫ్రికా మిగిలిన రెండు గెలవాలి. అలా జరిగితే వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ లో గెలిచిన జట్టుపై భారత్ గెలవాల్సి ఉంటుంది.

అప్పుడు భారత్ జింబాబ్వే, వెస్టిండీస్ లకు చెరో 2 పాయింట్లు ఉంటాయి. అప్పుడు భారత్ కు నెట్ రన్ రేట్ కీలకంగా ఉంటుంది. భారత్ తమ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే, వారికి 2 మ్యాచ్‌లలో 4 పాయింట్లు ఉంటాయి. మరో రెండు జట్లు కూడా 4 పాయింట్లు సాధించకపోతే సెమీఫైనల్‌కు చేరుకోవడానికి ఇది సరిపోతుంది. దక్షిణాఫ్రికా మిగిలిన మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిస్తే.. వెస్టిండీస్ , జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ లో విజేతను కూడా దక్షిణాఫ్రికాను ఓడించినట్లయితేనే అది సాధ్యమవుతుంది. భారత్ రెండు మ్యాచ్ లు గెలిస్తే ఏ ఇబ్బంది ఉండదు.
ఇవి కూడా చదవండి






