స్టాన్‌ఫోర్డ్‌కు ఎంపికైన మధుకు హార్వర్డ్ వర్సిటీ నుంచి ఆహ్వానం
కొద్ది నెలల క్రితమే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివేందుకు ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పెరుగ్గూడేనికి చెందిన మధుకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. హార్వర్డ్ వర్సిటీ నుంచీ ఆయనకు ఆహ్వానం అందించింది. భారత్ నుంచి హార్వర్డ్‌కు ఎంపికైన ఇద్దరిలో మధు ఒకరు. ఈ రెండు వర్సిటీల్లో ఎందులోనైనా మధు ఎంబీఏ పూర్తి చేసేందుకు ధీరుబాయ్ అంబానీ పౌండేషన్ రూ.1.50 కోట్లను స్కాలర్‌షిప్‌గా అందించనుంది. పెరుగ్గూడేనికి చెందిన సామాన్య రైతు యలపర్తి వెంటక సుబ్రహ్మణ్యం కుమారుడు మధు. ఆయన 2012లో ఐఐటీ పూర్తయ్యాక, రెండేళ్ల ముంబైలోని దాల్‌బర్గ్ అనే మల్టీనేషనల్ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేశారు. అనంతరం మరో రెండేళ్లు ఇథియోఫియా ప్రధాని సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం టాటా, రాకర్, ఫిట్టర్ వంటి సంస్థలతో కలిసి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఈ సంస్థ ద్వారా రైతులు, సామాన్యులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం రాష్ట్రంలో సోలార్, బోర్‌వెల్స్, పారిశుధ్యం, టెలిమెడిసిన్ వంటి ప్రాజెక్టుల్లో సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు మందుకు రావాలని మధను కోరింది. దీనిపై మధు గంతో ఒకసారి సీఎం చంద్రబాబుతో సమవేశమయ్యారు. ప్రతీ ఒక్కరూ ఆర్థిక బలోపేతం అయ్యేలా కృషి చేయడమే తన లక్ష్యమని మధు వెల్లడించారు.













