Minister Gottipati: సీఎం చంద్రబాబు పై నమ్మకంతో పెట్టుబడులు : మంత్రి గొట్టిపాటి
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అవతరిస్తోందని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) అన్నారు. విశాఖ (Visakhapatnam)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 గేమ్ ఛేంజర్‌గా నిలవనుందని పేర్కొన్నారు. దీని ద్వారా రికార్డుస్థాయిలో పెట్టుబడులు వస్తాయన్నారు. రూ.5,22,471 కోట్ల పెట్టుబడుల వల్ల 2,67,239 ఉద్యోగాల కల్పన జరగనుందని చెప్పారు. దిగ్గజ సంస్థల చూపు రాష్ట్రం వైపు ఉందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు ఏపీ కేంద్ర బిందువుగా మారుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు (Chandrababu)పై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. విశాఖ సీఐఐ సదస్సు వేదికగా పునరుత్పాదక విద్యుత్ రంగంలో 48 ఎంవోయూలు చేసుకుంటున్నట్లు తెలిపారు.






