Minister Gottipati:పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం : మంత్రి గొట్టిపాటి

యాక్సెస్ ఎనర్జీ(Access Energy) , సుజలాన్(Sujalan) ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar ) సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసుకున్న ఎంవోయూ (MOU)ల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఇరు కంపెనీల క్షేత్రస్థాయి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను సంస్థ ప్రతినిధులకు వివరించారు. గత ప్రభుత్వం విధానాలతో ఐదేళ్లుగా భారీగా నష్టపోయామని తెలిపారు. కూటమి ప్రభుత్వం మద్దతుతో సోలార్(Solar), విండ్ ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.