Gatha Vaibhavam: “గత వైభవం” తెలుగులో గ్రాండ్ గా రిలీజ్
ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కే. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. తమ సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఉత్తర అమెరికా, కెనడాలలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
ప్రైమ్‌షో క్రెడిబిలిటీ తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా జరుగుతున్నాయి, రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో ప్రమోషన్లు మరింత దూకుడుగా సాగనున్నాయి.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని విలియమ్ జె. డేవిడ్, సంగీతాన్ని జుదా శాండీ, ఆర్ట్ డైరెక్షన్ శివకుమార్, ఉన్నాస్ హైదూర్, రఘు మైసూర్ అందించారు.
లవ్, మైథాలజీ, పునర్జన్మ, పీరియడ్ డ్రామా, నాలుగు యుగాల నేపధ్యంలో సాగే ఈ కథ, అద్భుతమైన VFX తో ప్రేక్షకులకు విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.







