Vivek Ramaswamy: ఒహాయో గవర్నర్ పదవికి రామస్వామి పర్ ఫెక్ట్ : ట్రంప్..!
న్యూయార్క్ మేయర్ పదవిని కోల్పోయిన తర్వాత ట్రంప్ సర్కార్.. ఒహాయోపై ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఈపదవిని దక్కించుకోవడం ఇప్పుడు ట్రంప్ కు చాలా ముఖ్యం. దీనికి పోటీ పడుతుంది కూడా ఇంకెవరో కాదు భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత వివేక్ రామస్వామి (Vivek Ramaswamy). ఆయనను ‘ప్రత్యేకమైన వ్యక్తి’ (సమ్‌థింగ్ స్పెషల్) అంటూ ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. వివేక్ రామస్వామి ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా ట్రంప్ ఈ పోస్టు పెట్టారు. ఒహాయో రాష్ట్రాన్ని గ్రేట్ స్టేట్‌గా అభివర్ణిస్తూ, వివేక్ రామస్వామి ఎన్నికైతే గొప్ప గవర్నర్ అవుతారని ట్రంప్ పేర్కొన్నారు.
“ది గ్రేట్ ఒహాయో రాష్ట్రానికి వివేక్ రామస్వామి పోటీ చేస్తున్నారు. నాకు ఆ ప్రాంతం అంటే ఎంతో ఇష్టం. 2016, 2020, 2024 ఎన్నికల్లో నేను భారీ విజయం సాధించాను. వివేక్ నాకు బాగా తెలుసు. అధ్యక్ష ఎన్నికల్లో నాతోనే పోటీకి వచ్చాడు. అతడు ప్రత్యేకమైన వ్యక్తి. వివేక్ యువకుడు, తెలివైనవాడు, చాలా మంచి వ్యక్తి. అతనికి మన దేశం అంటే ఎంతో ఇష్టం” అని ట్రంప్ తన ట్రూత్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు.
ఒహాయో తదుపరి గవర్నర్‌గా ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి వివేక్ కృషి చేస్తారని ఆయన అన్నారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, వలస నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడటం, ఎన్నికల సమగ్రతను ముందుకు తీసుకువెళ్లడం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడుతారని ట్రంప్ పేర్కొన్నారు.
మొన్నటి ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీపడిన వారిలో వివేక్ రామస్వామి ఉన్నారు. కొన్ని రౌండ్ల పోటీ తర్వాత వివేక్ .. అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్నారు.దీంతో వివేక్ రామస్వామి ఉపాధ్యక్ష పదవికి పోటీ పడతారని అందరూ భావించారు. అయితే ట్రంప్ ..వివేక్, ఎలన్ మస్క్ లను సభ్యులుగా నియమిస్తూ డోజ్ అనే సిస్టమ్ ను ట్రంప్ సృష్టించారు. ఇది అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించడం, ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించడం చేస్తూ వచ్చింది.ఆరంభంలోనే రామస్వామి తప్పుకోగా.. కొన్ని నెలల క్రితం ఎలన్ మస్క్ ..డోజ్ ను వదిలేశారు. ఆ తర్వాత ట్రంప్.. ఎలన్ మస్క్ మధ్య మాటల యుద్ధం చెలరేగింది.తర్వాత నెమ్మదిగా మస్క్.. ఈవిషయాన్ని వదిలేసి బిజినెస్ లో నిమగ్నమయ్యారు.







