ఏపీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన నలుగురు వైఎస్సార్‍సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‍రాజు, రమేష్ యాదవ్‍లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మాణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.