Eversend: ఆంధ్రప్రదేశ్ కి ఎవర్సెండ్
బుర్జ్ ఖలీపా, పెట్రోనాస్ టవర్, చెన్నైలోని డీఎల్ఎఫ్ డౌట్టౌన్ తారామణి ప్రాజెక్టు, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫ్యాబ్రికేషన్ పనులూ నిర్వహించిన మలేసియాకు చెందిన ప్రఖ్యాత నిర్మాణసంస్థ ఎవర్సెండై (Eversend ) కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి రాబోతోంది. నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి తెలిపింది. బెర్హాద్కు చెందిన సంస్థ సీఎండీ తాన్శ్రీ ఎ.కె.నాథన్ (Tanshri A.K.Nathan) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ను సింగపూర్లో కలిసి ప్రతిపాదనపై చర్చించారు. రాష్ట్రంలోని విశాఖ, కృష్ణపట్నంలో ఏదో ఒకచోట 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు సమీకృత శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి చూపింది. ఇక్కడినుంచే దేశ్యాప్తంగా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను రవానా చేయనున్నట్లు పేర్కొంది. రాజధాని అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు ఆసక్తి తెలిపింది. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసితితో కలిసి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుపై ముఖ్యమంత్రితో సంస్థ ప్రతినిధులు చర్చించారు.







