High Court: తెలంగాణ హైకోర్టు వైబ్‌సైట్ హ్యాక్
తెలంగాణ హైకోర్టు (High Court) వెబ్సైట్ హ్యాకింగ్ (Website hacking) గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే, ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తోంది. పీడీఎఫ్ (PDF) ఫైల్స్‌కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ తెరుచుకుంటోంది. ఈ విషయంపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 11వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 11వ తేదీనే హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెబ్సైట్ హ్యాక్ చేసిన వారిని కనుక్కునే పనిలో పడ్డారు. వెబ్‌సైట్‌లోని సమస్యను క్లియర్ చేశారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ అధికారిక వెబ్సైట్లో ప్రతీ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ాఈ కేసులు్ణ ఎప్పుడు ఉంటాయన్న దానితో పాటు జడ్జీల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్ హ్యాక్ అయిన విషయం గురించి ఐటీ టీమ్ రిజిస్ట్రార్‌కు సమాచారం ఇచ్చింది. రిజిస్ట్రార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.






