ఏపీలో 1777కు చేరిన పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,782 మంది శాంపిల్స్ పరీక్షించగా 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1777కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 36కు చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 729 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ ఆసుపత్రుల్లో 1012 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 17 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 533కి చేరింది.






