Bandi Sanjay: ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాాలి : బండి సంజయ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాల విధానాలతోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు తమ తప్పును ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు మొదట అన్యాయం చేసిందే కాంగ్రెస్. రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా జలాల వాటా పంపిణీలో సెక్షన్ 89ను చేర్చి అన్యాయం చేసింది. తర్వాత కేసీఆర్ (KCR) ప్రభుత్వం కృష్ణా జలాల్లో 299టీఎంసీలు చాలని సంతకం చేసి తెలంగాణ హక్కులను కాలరాసింది అని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డికి సంబంధించి కేంద్రం అడిగిన వివరాలివ్వకుండా బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, అందుకే డీపీఆర్‌ను (DPR) కేంద్రం వెనక్కి పంపిందని తెలిపారు. ఇప్పటికైనా ఆ తప్పిదాలను సరిదిద్దాలని సూచించారు.






