Telugu: అధికార వ్యవహారాల్లో తప్పనిసరిగా తెలుగు ఉండాలి : జస్టిస్ పి.శ్రీనరసింహ
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు (Guntur)లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ (Sri Narasimha) పాల్గొని ప్రసంగించారు. ఇంత పెద్ద తెలుగు సభ జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. మనిషికి పుట్టుకతోనే మాతృబంధం, భాషాబంధం ఏర్పడతాయి. భాష కేవలం భావవ్యక్తీకరణకు మాత్రమే కాదు. ఒక ప్రపంచాన్ని సృష్టించేంత బలం భాషలో ఉంది. మనందరం భాష వల్ల బంధువులం. తెలుగు భాష వల్ల మనకు ఓ గుర్తింపు ఉంది. అధికార వ్యవహారాల్లో తప్పనిసరిగా తెలుగు ఉండాలి. జిల్లాస్థాయి వరకు కోర్టు కార్యకలాపాలు తెలుగు (Telugu)లో జరగాలి అని ఆకాంక్షించారు.






