Ramam: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బర్త్ డే విశెస్ తెలిపిన “రామమ్” మూవీ టీమ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “రామమ్”. ఈ రోజు ఈ యంగ్ స్టార్ హీరో పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది “రామమ్” మూవీ టీమ్. ఈ చిత్రాన్ని దోనేపుడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. లోకమాన్య దర్శకత్వం వహిస్తున్నారు.
ది రైజ్ ఆఫ్ అకిరా ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న రామమ్ సినిమా నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షాడో తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.






