Malavika Mohanan: విజయ్ తో అనుకుంటే ప్రభాస్ తో అవుతుంది
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్(KU mohanan) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక(Malavika mohanan) తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాళవిక ఇప్పటికే పలు తమిళ, మళయాల భాషల్లో నటించినప్పటికీ తన టాలీవుడ్ డెబ్యూ మాత్రం అనుకున్న దానికంటే కాస్త లేటైందని చెప్పొచ్చు. వాస్తవానికి మాళవిక టాలీవుడ్ డెబ్యూ జరగాల్సిందట.
విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా, ఆనంద్ అన్నామలై(Anand Annamalai) అనే తమిళ డైరెక్టర్ తో మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) బ్యానర్ లో రావాల్సిన హీరో అనే సినిమాలో మాళవికనే హీరోయిన్. ఈ సినిమా మొదలై, ఓ షెడ్యూల్ పూర్తయ్యాక ఆగిపోయింది. ఫస్ట్ షెడ్యూల్‌కే ఎక్కువ ఖర్చవడంతో ఈ సినిమాను వర్కవుట్ చేయలేమని మేకర్స్ మూవీని ఆపేసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అసలు విషయం కాదని మాళవిక రీసెంట్ గా రాజా సాబ్(Raja Saab) ప్రమోషన్స్ లో వెల్లడించారు.
విజయ్ ఆ సినిమాకు బదులు లైగర్ మూవీ చేయాలనుకోవడంతో కొంతభాగం షూటింగ్ జరిగాక ఆ సినిమా ఆగిపోయిందని, దీంతో తన టాలీవుడ్ డెబ్యూ ఆలస్యమైందని, కానీ ఆ సినిమా కథ చాలా బావుంటుందని, లవ్ స్టోరీ అవడంతో ఆ మూవీ విషయంలో తాను చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పింది. ఆ తర్వాత పలు తెలుగు మూవీ ఆఫర్లు వచ్చినప్పటికీ పెద్ద సినిమాతోనే టాలీవుడ్ డెబ్యూ చేయాలని అవేవీ ఒప్పుకోనట్టు పేర్కొన్నారు. అలా విజయ్ తో జరగాల్సిన మాళవిక డెబ్యూ ఇప్పుడు ప్రభాస్ తో రాజా సాబ్ ద్వారా జరుగుతుంది.






