Crezy Kalyanam: కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” మూవీ టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో “క్రేజీ కల్యాణం” సినిమా చిత్రీకరణ జరిపారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ వెల్లడించనున్నారు. “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో”, “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాలకు మ్యూజిక్ అందించిన సురేష్ బొబ్బిలి “క్రేజీ కల్యాణం” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.






