Kavitha: కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం
తన ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన రాజీనామాకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ఆమోదం తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత, గత ఏడాది సెప్టెంబర్ 3న తనపదవికి రాజీనామా (Resignation) చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ (Notification) జారీ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడంతో ఆ పార్టీతో పాటు, తద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని రెండు మూడు సార్లు మీడియా ముఖంగా కవిత విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమోదించలేదు. మండలిలో మాట్లాడుతూ ఆమె భాగోద్వేగానికి గురయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్‌ను కోరగా, భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని ఆయన సూచించారు. అయినప్పటికీ తన రాజీనామాను ఆమోదించాలని సభాముఖంగా ఆమె మరోసారి విజ్ఞప్తి చేయడంతో తాజాగా ఆమోదించారు.






