Mahesh Kumar : నాకు మంత్రి పదవి అవసరం లేదు .. రాష్ట్రంలో నేను నంబర్ 2
రాష్ట్రంలో నేను నంబర్ 2 అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. తనకు మంత్రి (Minister) పదవి అవసరం లేదని, ఇప్పటి వరకూ మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎవరినీ అడగలేదని చెప్పారు. విప్ రామచంద్రనాయక్‌తో (Ramachandra Nayak) కలిసి అసెంబ్లీ లాబీ వైపు ఆయన వస్తుండగా, కాబోయే ఇద్దరు మంత్రులు కలిసి వస్తున్నారంటూ విలేకరులు వారి వద్ద ప్రస్తావించారు. దీనికి మహేశ్‌గౌడ్ స్పందిస్తూ తాను నెంబర్ టూ స్థానంలో ఉన్నానని అన్నారు. మంత్రి పదవి వస్తే, కేవలం ఒకే శాఖను చూడాల్సి ఉంటుందని, తాను ఇప్పుడు అన్ని శాఖల గురించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని (Sonia Gandhi) తాను ఫోన్లో పరామర్శించానని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని వివరించారు.






