Shankar Rao:ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కోరిక.. పదవీ విరమణకు ముందు నెరవేరింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ను చూస్తూ సంతోషంతో మురిసిపోతున్న వ్యక్తి పేరు శంకర్రావు (Shankar Rao). రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్. 1996లో మార్చిలో అంటే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister)గా ఉన్నప్పుడు ఆయన టైపిస్ట్ (Typist) ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి చంద్రబాబును నేరుగా కలవాలనేది శంకర్రావు కోరిక. అది ఇన్నాళ్లకు నెరవేరింది. సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్యవర్గంతో కలిసి చంద్రబాబును కలిసి సంతోషంతో ఉప్పొంగిపోయారు.






