Rukmini Vasanth: రుక్మిణి కి మరో తెలుగు సినిమా అవకాశం
కన్నడ భామ అయినప్పటికీ సప్త సాగారాలు దాటి(Sapta sagaralu daati)ఫ్రాంచైజ్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది రుక్మిణి వసంత్(Rukmini vasanth). ఆ సినిమాల్లో తన యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. రుక్మిణి నేచురల్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అవడంతో అమ్మడికి అవకాశాలు బాగా వస్తున్నాయి. పైగా రీసెంట్ గా కాంతార1(kanthara1) మూవీలో నటించి తన ఖాతాలో మంచి హిట్ ను కూడా వేసుకుంది రుక్మిణి.
ఇదిలా ఉంటే ఆల్రెడీ ఎన్టీఆర్(ntr)- నీల్(Neel) మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి, యష్(Yash) హీరోగా వస్తున్న టాక్సిక్(toxic) మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో పాటూ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కనున్న ఆర్సీ17(rc17)లో కూడా రుక్మిణినే హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రుక్మిణి ఇప్పుడు మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) హీరోగా శ్రీను వైట్ల(Srinu vaitla) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో రుక్మిణిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, ఈ మూవీలో మరో సీనియర్ హీరో కనిపించనున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అప్డేట్ రానుందని తెలుస్తోంది.






