World Telugu Conference: మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు (World Telugu Conference) ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyannapatrudu), గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర (Kovelamudi Ravindra) చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ (Ghazal Srinivas) మహాసభలకు అధ్యక్షత వహించి మాట్లాడారు. తెలుగు భాష ప్రభుత్వానికి అధికార భాష, మాకు మాత్రం మమకార భాష. ఆంధ్ర సారస్వత పరిషత్తు, తరపున మూడోసారి ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నాం. రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాచీన భాష తెలుగు, నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి వారు తెలుగు భాషకు పట్టం కట్టారు. ఎన్టీఆర్, రామోజీరావు తెలుగుకు గుర్తింపు తెచ్చిన వారిలో ప్రముఖులు అని కొనియాడారు.






