Kondagattu: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి (Kondagattu Anjaneya Swamy) ఆలయాన్ని దర్శించుకోనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కే సాగర్ (RK Sagar) తెలిపారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొండగట్టులోని జేఎన్టీయూ కళాశాలకు (JNTU College) చేరుకొని, అక్కడి నుంచి కారులో ఆలయానికి చేరుకుంటారు. రూ.35.19 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేస్తారు. స్వామివారి దర్శనం అనంతరం నాచుపల్లి శివారులోని రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో సమావేశమై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. పవన్‌కల్యాణ్ గతంలో కొండగట్టు ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ధర్మశాల, దీక్ష విరమణ మండపాల నిర్మాణానికి హామీ ఇచ్చారు అని గుర్తు చేశారు.






