అందరికీ ఆరోగ్యం సమకూరితే రాష్ట్రమంతా ఆనందమే
అందరికీ ఆరోగ్యం సమకూరితే రాష్ట్రమంతా ఆనందమే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వైద్య, ఆరోగ్యంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజారోగ్యంపై జనం వ్యయం తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా సగం రోగాలను దూరం పెట్టవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్య ఖర్చులు ప్రతి కుటుంబానికి పెనుభారంగా మారుతున్న నేపథ్యంలో ఆ ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. తాగునీరు, పీల్చే గాలి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. అందరికీ ఆరోగ్యం సమకూరితే రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్గా రూపొందుతుందన్నారు. పాఠశాలలో యోగా, కూచిపూడి ప్రవేశపెట్టింది ఆరోగ్యం, ఆనందం కోసమేన్నారు. చిన్నప్పట్నుంచీ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచితే 20శాతం ప్రజలను చైతన్య పరిచినట్లేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యరక్ష, ఉచిత క్లినికల్ టెస్ట్లు, సీఎం ఆర్యోగ కేంద్రాలు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.













