వినోద్‌ఖన్నా మృతికి సీఎం చంద్రబాబు సంతాపం
ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఎంపీ వినోద్ ఖన్నా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర సాంస్కృతికశాఖ, పర్యాటకశాఖ మంత్రిగా పనిచేసిన వినోద్ ఖన్నా సేవలు మరువలేనివన్నారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదన్నారు. వెండితెరపైనే కాక రాజకీయ రంగంలోనూ వినోద్‌ఖన్నా తనదైన శైలిలో రాణించారన్నారు. వినోద్ ఖన్నా డైలాగులు ఎన్నటికీ గుర్తిండిపోతాయన్నారు. విలన్‌గా, హీరోగా విభిన్న పాత్రలలో వినోద ఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.













