శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు తదితరులు దర్శించుకున్నారు. అంతకుముందు పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైలంలోని పాతాళ గంగలో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఎఫ్‌ఐసీసీఐ భాగస్వాములుగా ఉన్నారు.