రేషన్ కు బదులుగా నగదు : చంద్రబాబు
రేషన్‌కు బదులుగా నగదు కావాలంటే ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా పొగరహిత జిల్లాగా ఖ్యాతి గడించిందన్నారు. 2018 నాటికి బహిరంగ మలవిసర్జన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో 47 లక్షల మందికి రూ.వెయ్యి పింఛను చొప్పున ఇస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేన్నారు. జిల్లాలో పరిశ్రమలు రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాలుష్యాన్ని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వందశాతం వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్న జిల్లా పశ్చిమగోదావరి జిల్లాయేనని అన్నారు. ప్రజలకు నీతిమంతమైన, సమర్థమైన పాలన అందజేస్తామని సృష్టం చేశారు. రాజకీయ నాయకులు నీతివంతమైన పాలనకు కట్టుబడాలని పిలుపునిచ్చారు. అధికారులు అవినీతికి పాల్పడకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూన్ నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.






