కార్మికలోకానికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని కార్మిక లోకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. శ్రమ సంస్కృతిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, కష్టాల్ల ఉన్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి తమ శ్రమనే నమ్ముకున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని, పని ప్రదేశాల్లో మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయ కార్మికులు, స్వయం సహాయక బృందాల మహిళలు, ఉపాధి హామీ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు.













