రష్యా ప్రతినిధులతో సీఎం భేటీ
చెల్యాబినిస్క్ గవర్నర్ బోరిస్ డుబ్రోవిస్కీ ఆధ్వర్యంలో వివిధ కంపెనీల సీఈవోల బృందం ఏపీకి వచ్చి శనివారం ఉండవల్లిలో సీఎంతో భేటీ అయ్యింది. అక్కడి రవాణా, ఖనిజాలు, అణువిద్యుత్తు సంబంధిత కంపెనీల ప్రతినిధులు ఏపీలో ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సీఎంతో చర్చించారు. వాణిజ్య సంబంధాలు, ఇతర అంశాల్లో సహాయ సహకారాల కోసం చెల్యాబినిస్క్ డిప్యూటీ గవర్నర్, ఏపీఈడీబీ నేతృత్వంలో జాయింట్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలని ఇరు ప్రభుత్వాలు అవగాహనకు వచ్చాయి. అలాగే ఇరు ప్రాంతాల విద్యార్థులు, రైతులు విజ్ఞానాన్ని పంచుకొనేందుకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించాయి.






