Chandrababu: జర్మనీలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీ వరకు జర్మనీ (Germany)లోని వివిధ నగరాల్లో వారం రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు టీడీపీ ఎన్నారై జర్మనీ విభాగం నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా హాంబర్గ్‌లో కేకు కోసి సంబంరాలు నిర్వహించారు. డా.శివశంకర్ లింగం (Dr. Sivashankar Lingam) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు(Mannava Subbarao), మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రానికి, నవ్యాంధ్రకు సీఎంగా చంద్రబాబు తెచ్చిన సంస్కరణలు, చేసిన సేవల్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకొన్నారు. అభివృద్ధికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని వెల్లడిరచారు. చంద్రబాబు 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకొని డైమండ్ జూబ్లీ పేరుతో జర్మనీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రక్తదాన శిబిరాలు, క్రీడా, క్విజ్ పోటీలు నిర్వహిస్తాం. ఆహారం పంపిణి చేస్తాం అని టీడీపీ నేతలు తెలిపారు.







