Chandrababu : విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వ్యక్తిగత పర్యటనపై యూరప్ (Europe) వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు బుధవారం రాత్రి విజయవాడ (Vijayawada)లో విందు ఇవ్వనున్నారు. అనంతరం ఢల్లీికి వెళ్తారు. అక్కడి నుంచి యూరప్ పర్యటనకు బయల్దేరతారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు జన్మదినం. అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలు(Birthday celebrations) చేసుకోనున్నారు. తిరిగి ఈ నెల 22వ తేదీన ఢల్లీికి చేరుకుంటారు. 23న కేంద్ర మంత్రుల (Union Ministers )ను కలిసే అవకాశం ఉంది.







