CII Summit : సీఐఐ సదస్సు రెండో రోజు.. పర్యాటక రంగంలో రూ.17,800 కోట్లతో
విశాఖ నగరంలో జరుగుతున్న 30వ సీఐఐ సమ్మిట్లో (CII Summit) భాగంగా రెండో రోజు రూ.17,800 కోట్ల భారీ పర్యాటక పెట్టుబడులు రానున్నాయి. మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) సమక్షంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నేడు 10 ఎంవోయూ (MOU) లు చేసుకోనున్నాయి. తద్వారా రాష్ట్రంలో 10,690 రూమ్స్ ఏర్పాటు కానున్నాయని, 88,876 మందికి పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉపాధి లభించనుందని కందుల దుర్గేష్ తెలిపారు. ఇందులో ప్రత్యక్షంగా 32,206 పరోక్షంగా 56,670 మందికి ఉపాధి లభించనున్నట్లు వెల్లడిరచారు. తొలిసారిగా రూ.1,860 కోట్ల విలువైన పర్యాటక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) ఎంవోయూలపై సంతకాలు చేస్తున్నామని, తద్వారా 12,500 ఉద్యోగాలు వస్తాయని దుర్గేష్ అన్నారు. పారిశ్రామికవేత్తల స్పందనతో పర్యాటక రంగంలో నూతనోత్తేజం వచ్చిందని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు వేగంగా అనుమతులు జారీ చేస్తామని, అవసరం మేరకు భూములు కేటాయిస్తామన్నారు.






