Chandrababu: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
• సహజ వాయువు, ఎల్ఎన్జి రంగంలోని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరిన సీఎం చంద్రబాబు.
• రాష్ట్రంలోని ఎల్ఎన్జి టెర్మినళ్లను మరింతగా అభివృద్ధి చేయాలని కోరిన సీఎం.
• IOCL, GAIL, BPCL, HPCL, పెట్రో నెట్ ఎల్ఎన్జి వంటి చమురు కంపెనీలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చూడాలని కోరిన సీఎం చంద్రబాబు.
• ఏపీ వ్యాప్తంగా గ్యాస్ పైప్ లైన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను విస్తరించాలని కోరిన ఏపీ సీఎం.
• దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 2030 నాటికి 6 శాతం నుంచి 15శాతానికి పెంచాలన్న ప్రధాని మోదీ విజన్‌కు ఏపీ తన వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపిన సీఎం.
• రాష్ట్రంలోని 65.40 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పరిధిలోకి తీసుకురావాలని వినతి.
• పీఎంయూవై పథకం పరిధిలోకి వస్తే పథకం లబ్దిదారులకు సిలిండరుపై రూ.300 రాయితీ అందుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కు చెప్పిన ముఖ్యమంత్రి.






