Chandrababu: పల్లాకు బాబు ప్రమోషన్..?

2019 నుంచి 2024 వరకు కష్టపడిన తెలుగుదేశం పార్టీ 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకత్వం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో జరిగిన తప్పులను మళ్లీ జరగకుండా చూసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటుగా పార్టీ అక్రమాయకత్వం తీవ్రంగా కష్టాలు పడుతోంది. సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను టిడిపి నాయకులు ప్రచారం చేసే దిశగా మార్గ నిర్దేశం చేస్తూ వస్తోంది.
దీంతోపాటుగా నాయకత్వం విషయంలో కూడా త్వరలోనే మరిన్ని మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasarao)ను చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. గత ఏడాదికాలంగా ఆయన పనితీరుపై ప్రశంసలు వ్యక్తం అయ్యాయి. పార్టీ నాయకులతో ఆయన సమన్వయం చేసుకునే విషయం గానీ లేదంటే పార్టీ ఆఫీసులో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు గాని అన్నీ కూడా చంద్రబాబు మెచ్చుకుంటూ వస్తున్నారు.
ఈ తరుణంలో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉన్న నేపథ్యంలో దానికి పల్ల శ్రీనివాసరావును ఎంపిక చేసే దిశగా కూటమి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఆయన విషయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో పాటుగా బిజెపి నాయకులు కూడా సానుకూలంగానే ఉన్నారనేది రాజకీయ వర్గాల మాట. ఆ ఒక్క మంత్రి పదవి విషయంలో ఎప్పటినుంచో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నా సరే ఇప్పటివరకు ముందడుగు పడలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఒక్క స్థానాన్ని భర్తీ చేసి ప్రభుత్వాన్ని ముందుకు నడపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.