విజయవాడ దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.