ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం… పొడిగింపు

ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెలాఖరున ఆదిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేయాలి. అయితే సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.