ఏపీలో అమీత్ షా పర్యటన
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమీత్షా ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ ఎంపీ కె.హరి బాబు తెలిపారు. మే 25న విజయవాడలో నిర్విహించే బూత్ కమిటీ సమావేశానికి కూడా హాజరవుతారని తెలిపారు. సామాజిక న్యాయం కోసమే పుట్టామంటున్న పార్టీలు జాతీయ బీసీ కమీషన్ కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు బీజేపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ అమలుతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఉంటుందని తెలిపారు. జులై 1 నుంచి జీఎస్టీ అమలు బీజేపీ సాధించిన ఘనవిజయమని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుతో బీజేపీపై నమ్మకం పోతుందనుకున్న ప్రతిపక్షాల ఆలోచన తప్పిందమని వివర్శించారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో బీజేపీ విజయమేందుకు నిదర్శమని అన్నారు.






