శాసనసభ సీట్ల పెంపుపై కేంద్రం కసరత్తు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెంచే అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల నాటికి శాసనసభ స్థానాల పెంపు ప్రక్రియను పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.






