Ashoka Gajapati Raju: మరోసారి దేశానికి సేవ చేసే అవకాశం : అశోక్‌గజపతిరాజు

అవకాశాల కోసం తానెప్పుడూ పరిగెత్తలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashoka Gajapati Raju) అన్నారు. గోవా గవర్నర్ (Goa Governor)గా అశోక్ గజపతిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకాశాలు వచ్చిప్పుడు బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. గవర్నర్‌గా తన పేరును సీఎం చంద్రబాబు (CM Chandrababu) సిఫార్సు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ నియామకంతో తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత నాపై ఉంది. ఓటమితో నిరుత్సాహ పడనక్కర్లేదు. దాని నుంచి పాఠాలు నేర్చుకుని మరింత ఉన్నతంగా ముందుకు వెళ్లొచ్చు. గోవా అంటే ప్రియ మిత్రుడు మనోహర్ పారికర్ (Manohar Parrikar) గుర్తొస్తారు. కోరకొండ (Korakonda ) సైనిక స్కూల్‌లో అమ్మాయిలకూ చదివే అవకాశం కల్పించాలని ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పడు కోరాను. దేశానికి సేవ చేసే అవకాశం మరోసారి లభించడం ఆనందంగా ఉంది. అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు.