తిరుపతిలో ఆపిల్?
తిరుపతి సమీపంలో ఆపిల్ సంస్థ హార్డ్వేర్ పరిశ్రమను నెలకొల్పాలని ఆసక్తి చూపుతోంది. ప్రపంచ ప్రసిద్ధ ఈ సంస్థను రాష్ట్రానికి రప్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమెరికాలోని ఆపిల్ ప్రధాన కార్యాలయం నుంచి ముగ్గురు అత్యున్నత ప్రతినిధుల బృందం సచివాలయంలో ఈ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్తోనూ సమావేశమైంది. ఆపిల్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి పోటీ ఎక్కువగా ఉన్నందున చర్చల వివరాలను గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. సాఫ్ట్వేర్, ఐఫోన్, కంప్యూటర్లు తదితర రంగాల్లో హార్డ్వేర్ పార్కు ఏర్పాటు చేయాలని ఆపిల్ భావిస్తున్నట్లు సమాచారం. అమరావతి కూడా వారి ప్రాధాన్యాల్లో ఒకటని తెలుస్తోంది. ఆపిల్ను రాష్ట్రంలో స్థాపిస్తే 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఐటి విధానాలపై సమగ్రంగా ఆరా తీసిన యాపిల్ బృందం, త్వరలోనే మరో మారు సంప్రదింపుల కోసం వచ్చేందుకు సన్నద్ధత వ్యక్తం చేసింది. ఈ సమవేశంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్, రాష్ట్ర ఐటి సలహాదారు జె.ఎ.చౌదరి పాల్గొన్నారు.













