చిత్తూరు జిల్లాకు యాపిల్ కంపెనీ
చిత్తూరు జిల్లాకు త్వరలో యాపిల్ కంపెనీ వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆ కంపెనీ కంప్యూటర్లు, సెల్ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల (హార్డ్ వేర్) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పరిశ్రమ ఏర్పాటైతే నాలుగైదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.






